మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘కింగ్డమ్’ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి హైప్ నెలకొనగా సినిమా మధ్యలో కొంచెం ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఇపుడు సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ మాత్రం అదరగొట్టింది అని చెప్పాలి.
అనిరుద్ ఇచ్చిన సంగీతం దర్శకుడు టేకింగ్ ఆడియెన్స్ లో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెంచాయి. దీనితో ఇపుడు కింగ్డమ్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి అని చెప్పాలి. ఇక ఇదే పాజిటివ్ వైబ్స్ కొనసాగితే మాత్రం కింగ్డమ్ తో విజయ్ కూడా భారీ ఓపెనింగ్స్ అందుకోవచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ మే 30న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకురాబోతున్నారు.