చౌరస్తా బ్యాండ్ బ్యాచ్ కోసం మన తెలుగు ఆడియన్స్ కు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సంగీత ప్రియులకు అయితే అసలే చెప్పనవసరం లేదు. “ఊరెళ్ళిపోతా మామ” అంటూ పాడినా “మాయా” అంటూ పాడినా వీరి బ్యాచ్ నుంచి వచ్చిన ప్రతీ ట్రాక్ సూపర్ హిట్ అయ్యింది.
అయితే ప్రస్తుతం మన దేశం సహా రెండు తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్ కారణంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలుసు. లాక్ డౌన్ విధించిన ఆరంభంలో ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టిన వారిని ఆపడానికి చౌరస్తా బ్యాచ్ నుంచి వచ్చిన ఓ పాట చాలా ఉపయోగపడింది. అలా తమ పాటతో ప్రజల్లో ఎంతో అవగాహన కల్పించినందుకు గాను హైదరాబాద్ సిటీ పోలీసు శాఖ వారు వాళ్లకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.