గోవా బ్యూటీ ముంబైలో ఇంటి కోసం వేట

గోవా బ్యూటీ ముంబైలో ఇంటి కోసం వేట

Published on Nov 1, 2012 2:09 PM IST


బాలీవుడ్లో చేసే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో గోవా బ్యూటీ ఇలియానా కూడా ఒకరు. తను హిందీలో చేసిన మొదటి సినిమా ‘బర్ఫీ’ కి మంచి పేరు వచ్చింది. దాంతో ఈ భామకి బాలీవుడ్లో డిమాండ్ పెరిగింది. ఇలియానా ఇప్పటికే షాహిద్ కపూర్ తో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపింది ఈ గోవా బ్యూటీ బాలీవుడ్లో తన కెరీర్ చాలా బాగుంటుందని నమ్ముతోంది, అందుకే తన మకాం ముంబైకి మార్చేయాలని నిర్ణయించుకుంది.

ఇప్పటికే ముంబైలో మంచి ఇల్లు కోసం వేట మొదలైంది. ‘ ముంబైలో నాకు నచ్చే విధంగా ఉండే ఇల్లు కోసం చూస్తున్నాను. ముంబై అయితే అటు బాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సినిమాలు చూసుకోవడానికి సులభంగా ఉంటుంది. గోవాలోనే ఉంటె కొంచెం ఇబ్బంది అవుతుంది. ‘బర్ఫీ’ సినిమాలో నా నటనకి మంచి పేరు వచ్చింది. దర్శకుడు అనురాగ్ బసు చెప్పినట్లే చేసాను’ అని ఇలియానా అన్నారు.

ఈ రోజు ఇలియానా పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కాం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

తాజా వార్తలు