ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటిది దర్శకుడు రాధా కృష్ణతో తీస్తున్న 20వ సినిమా “రాధే శ్యామ్” కాగా మరోకటి దర్శకుడు నాగశ్విన్ తో చేస్తున్న 21వ చిత్రం. ప్రస్తుతానికి ప్రభాస్ 21 గానే పిలవబడుతున్న ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ కంటే ఒకింత ఎక్కువ ఆసక్తినే కనబరుస్తున్నారు.
ఇదిలా ఉండగా చిన్న అప్డేట్ ను కూడా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు సహా దర్శకుడు అందించడం ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగించే అంశంగా మారింది. అందులో భాగంగా ఈ చిత్రానికి వారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెను ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం చేసారు. అయితే అప్పటి నుంచి దీపికా విషయం కాస్త హాట్ టాపిక్ అయ్యింది. అలా ఇప్పుడు మరో ఆసక్తికర బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి దీపికా భారీ 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు బాలీవుడ్ సినీ వర్గాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వార్త. మరి దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.