టాలివుడ్ అందగాడిగానే కాదు, భక్తి రస చిత్రాలకు ప్రసిద్ది చెందిన నటుడు నాగార్జున. పరిశ్రమలో పెద్ద హీరోగా పేరొందినా కూడా ప్రయోగాలకు తానెప్పుడు సిద్దమే అని చెప్పే అతికొద్ది మంది హీరోలలో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి తరం ప్రేక్షకులను కూడా భక్తిరస చిత్రాలతో మెప్పించడం నాగార్జునకి మాత్రమే సాధ్యమయ్యింది. ఈ ప్రయత్నంలో ఆయన “అన్నమయ్య” మరియు “శ్రీ రామ దాసు” వంటి చిత్రాలలో తన నటనతో అటు పెద్దలనే కాకుండా యువతను కూడా ఆకట్టుకున్నారు. కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున సాయి బాబాగా నటించిన “శిరిడి సాయి” చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది.ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు ఈ చిత్రంలో నాగార్జున నటన గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు ప్రత్యేకంగా చివరి ముప్పై నిమిషాలు తెర మీద మాకు నాగార్జున కనపడలేదని సాక్షాత్ సాయినాధుడు కనిపించారని అంటున్నారు. సాయిబాబాలోని ప్రేమరసాన్ని నాగార్జున అద్భుతంగా తెర మీద పండించారని కొన్ని సన్నివేశాల్లో అయన నటనతో కంటతడి పెట్టించారని జనం అంటున్నారు. ఇలానే అయన మరిన్ని భక్తి చిత్రాలను చెయ్యాలని కోరుకుంటున్నారు. కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించారు.
శిరిడి సాయి చిత్రానికి నీరాజనం పట్టిన జనం
శిరిడి సాయి చిత్రానికి నీరాజనం పట్టిన జనం
Published on Sep 6, 2012 6:30 PM IST
సంబంధిత సమాచారం
- టాలీవుడ్ నుంచి మరో సూపర్ హీరో.. ఈసారి నిఖిల్ వంతు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘ఘాటి’ ప్రమోషన్స్‌కు అనుష్క నో.. వర్కవుట్ అయ్యేనా..?
- ‘మిరాయ్’ కోసం రంగంలోకి హోంబలే ఫిల్మ్స్..!
- అఖండ 2 : ఆ ఒక్క క్లారిటీ ఎప్పుడొస్తుంది..?
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- శేఖర్ కమ్ముల నెక్స్ట్.. ‘కుబేర’ కాంబినేషన్ మళ్ళీ!
- వైరల్ వీడియో : రొమారియో షెఫర్డ్ అద్భుతం – ఒకే బంతికి 22 పరుగులు!
- రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. బ్లాస్ట్‌ను రెడీ చేస్తున్న ‘పెద్ది’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?