పవన్ – త్రివిక్రమ్ ‘హరే రామ హరే కృష్ణ’?

పవన్ – త్రివిక్రమ్ ‘హరే రామ హరే కృష్ణ’?

Published on Oct 31, 2012 9:53 AM IST


‘జల్సా’ క్రేజీ కాంబినేషన్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మరోసారి కలిసి పనిచేయబోతున్న సినిమాకి ‘హరే రామ హరే కృష్ణ’ అనే టైటిల్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. గతంలో ఈ టైటిల్ త్రివిక్రమ్ మహేష్ బాబు కోసం అనుకున్నారు. ఆ సినిమా కార్యరూపం దాల్చకపోవడంతో హరే రామ హరే కృష్ణ టైటిల్ ని పవన్ సినిమాకి వాడుకోవాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీని అధికారికంగా సమాచారం లేనప్పటికీ ఈ టైటిల్ మాత్రం ఖరారైనట్లేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ బ్యానర్ లిమిటెడ్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన సమంత కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. జల్సా కాంబినేషన్ కంటిన్యూ చేస్తూ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.

తాజా వార్తలు