ఆర్ ఆర్ ఆర్ హీరోల లుక్స్ అందరూ అనుకునేలా ఉండవా..!

నిన్న ‘ఆర్ ఆర్ ఆర్’ హీరోలు ఓ సామాజిక బాధ్యత నెరవేర్చారు. నూతన కోవిడ్-19 వైరస్ కారణం భయానక పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రజల్లో అవగాహన కోసం ఓ వీడియో చేయడం జరిగింది. కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, అపోహలను వ్యాపి చేయవద్దు అని చెప్పుకొచ్చారు. ఐతే ఈ వీడియోలో ఎన్టీఆర్ చరణ్ లుక్స్ గమనిస్తే ఎన్టీఆర్ తన జుట్టును కొద్దిగా తగ్గించారు, అలాగే గడ్డం ట్రిమ్ చేశారు. ఇక చరణ్ విషయానికి వస్తే ఆయన నీట్ షేవ్ గడ్డంలో కనిపించారు. జుట్టు కూడా కొంచెం షార్ట్ చేసినట్టు అనిపించింది. ఇద్దరు హీరోలు కోర మీసం మాత్రం కలిగివున్నారు.

రాజమౌళి ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా, చరణ్ ని అల్లూరిగా ఎలా చూపించనున్నాడు అనే ఆసక్తి ఎప్పటినుండో ఉంది. మొన్నటి వరకు బాగా పెరిగిన గడ్డంలో ఉన్న ఎన్టీఆర్ జుట్టు, గడ్డం ఎందుకు తగ్గించారో అర్థంకాలేదు. ఇక చరణ్ కోరమీసం మినహా జుట్టు, గడ్డం పెంచలేదు. చరిత్రలో అల్లూరి లుక్ చూస్తే ఆయన పెరిగిన జుట్టు, గడ్డంలో కనిపిస్తారు. మరి నీట్ షేవింగ్ లో చరణ్ కనిపిస్తుండగా అల్లూరిగా ఆయన లుక్ రాజమౌళి ఎలా సెట్ చేశాడు అనేది ఆసక్తికరం. ఇది ఓ ఫిక్షన్ స్టోరీ అని రాజమౌళి చెవుతున్న క్రమంలో ఎన్టీఆర్, చరణ్ లుక్స్ కూడా చరిత్రతో సంబంధం లేకుండా ఉంటాయా అనే అనుమానం కలుగుతుంది.

Exit mobile version