విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన “గార్డ్” సినిమాను జగ్గా పెద్ది దర్శకత్వంలో అనసూయ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది.
ఈ సినిమాలో హీరో గార్డుగా పనిచేస్తూ ఎదుర్కొన్న అనూహ్యమైన పరిస్థితులు, వాటిని అతను ఎలా అధిగమించాడన్నదే కథా సారాంశం. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. మొత్తం షూటింగ్ ఆస్ట్రేలియాలో జరిగింది, అందుకే విజువల్స్ కూడా కొత్తగా కనిపిస్తాయి.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, త్వరలో మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా విడుదల కానుంది.