కరోనా మహమ్మారి బారినపడి వరుసగా నటులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిరోజుల క్రితం స్టార్ వార్స్ నటుడు ఆండ్రూ జాక్ కరోనా వైరస్ కారణంగా మరణించడం జరిగింది. అలాగే మరో హాలీవుడ్ నటుడు కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. నాష్ విల్లే, ది స్టంట్ మాన్ వంటి చిత్రాలలో నటించిన అలెన్ గార్ఫీల్డ్ ఈ మహమ్మారి వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఇక హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ సైతం కరోనా వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోలుకోవడం జరిగింది.
తాజాగా హాలీవుడ్ లెజెండరీ నటి హిల్లరీ హీత్ కూడా కరోనా వైరస్ సోకి ప్రాణాలు విడిచినట్టు వైద్యులు నిర్ధారించారు. 74 సంవత్సరాల హీత్, కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.
ఈ విషయాన్ని ఆమె కుమారుడు అలెక్స్ సామాజిక మాధ్యమాల ద్వారా కన్ఫామ్ చేశాడు. ‘విచ్ ఫైండర్ జనరల్’తో హిల్లరీ హీత్ నటిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ‘ఆన్ ఆవ్‌ఫుల్లీ బిగ్ అడ్వెంచర్’, ‘హ్యూ గ్రాంట్’, ‘గ్యారీ ఓల్డమన్స్ నిల్ బై మౌత్’ వంటి మూవీస్ కు ఆమె నిర్మాతగా వ్వవహరించారు. ఈమె మరణంపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.