‘హిట్ 3’ యూఎస్ ప్రీమియర్స్ ఫైనల్ గ్రాస్ లెక్క ఇదే!

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హిట్ 3’ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత చూపిస్తోంది. నాని ముందు నుంచీ ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.

ఇక నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కాగా యూఎస్‌లో ఈ మూవీ ముందుగానే ప్రీమియర్స్ రూపంలో రిలీజ్ అయ్యింది. అమెరికా మార్కెట్‌లో నానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ క్రేజ్ ఎలాంటిదో ఈ చిత్ర రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. ‘హిట్ 3’ చిత్రానికి యూఎస్ ప్రీమియర్స్ రూపంలో ఏకంగా 868K డాలర్ల ఫైనల్ గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

ఇక లాంగ్ వీకెండ్ ఉండటంతో ఈ మూవీ మిలియన్ మార్క్ దాటడం చాలా ఈజీ అని.. టోటల్ రన్‌లో నాని ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

Exit mobile version