అమెరికాలో ‘హిట్ 3’ విధ్వంసం.. మామూలుగా లేదుగా!

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా అన్ని ఏరియాల్లో అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది.

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా 1.6 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తుంది. నార్త్ అమెరికాలో నాని ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నాని పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.

Exit mobile version