నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ హిట్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్ కి ముందు సాలిడ్ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చి ఆ అంచనాలు అన్నీ అందుకొని అదరగొట్టింది. ఇక నాని కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు అందుకునే సినిమాగా ఇది దూసుకెళ్తుండగా వరల్డ్ వైడ్ గా 6 రోజుల రన్ ని ఈ చిత్రం కంప్లీట్ చేసుకుంది.
అయితే ఈ 6 రోజుల్లో కూడా ఈ చిత్రం మొత్తం టార్గెట్ ని అందుకొని బ్రేకీవెన్ కొట్టేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ 6 రోజుల్లో హిట్ 3 చిత్రం 60 కోట్లకి పైగా షేర్ ని రాబట్టినట్టుగా పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. ఇలా మొత్తానికి నాని కెరీర్లో మరో సాలిడ్ హిట్ ని వేసుకున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కించారు.