బుక్ మై షోలో హిట్-3 ర్యాంపేజ్..!

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో రఫ్ఫాడిస్తున్నాడు. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

అయితే, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో హిట్-3 మూవీ కోసం ఏకంగా 7,00,000 పైగా టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో ఈ మూవీ వసూళ్ల పరంగా కూడా చాలా స్ట్రాంగ్‌గా దూసుకెళ్తోంది.

ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ మరింత కలిసిరానుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

Exit mobile version