న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. సౌత్‌తో పాటు ఈ మూవీని నార్త్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే, హిందీ బెల్ట్‌లో నానికి కష్టాలు తప్పేలా లేవనిపిస్తుంది.
నార్త్‌లో మే 1న మరో ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘రైడ్-2’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అప్పట్లో ‘రైడ్’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాతో నాని ‘హిట్-3’ ఎంతమేర పోటీ పడగలదు అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే, సినిమాలోని కంటెంట్ ఎంత పోటీ ఉన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నాని బలంగా నమ్ముతున్నాడు. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మరి బాలీవుడ్‌లో ‘హిట్-3’ ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో తెలియాలంటే మే 1 వరకు వెయిట్ చేయాల్సిందే.