సెన్సార్ ముగించుకున్న హిట్-3.. రన్‌టైమ్ ఎంతంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘హిట్-3’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. వయొలెన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 37 నిమిషాలుగా ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే కంటెంట్ ఉండటంతో వారికి ఎక్కడా బోర్ కొట్టదని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version