టాలీవుడ్ లో భారీ చిత్రాల దర్శకుడిగా దర్శకుడు గుణ శేఖర్ కి మంచి పేరుంది. చూడాలనివుంది, ఒక్కడు, రుద్రమదేవి వంటి భారీ చిత్రాలు ఆయన తెరకెక్కించారు. కాగా కొన్నేళ్లుగా గుణశేఖర్ ఓ భారీ పౌరాణిక మూవీపై పని చేస్తున్నారు. పురాణాలలో శివ భక్తుడు మరియు రాక్షస రాజు హిరణ్యకశిపుడు ఉన్నారు. ఆయన పాత్రను ప్రాధానంగా చేసుకొని హిరణ్య కశిప అనే ఓ భారీ చిత్రాన్ని గుణశేఖర్ చిత్రం గుణ శేఖర్ తెరకెక్కించనున్నాడు.
ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఐతే ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలం అవుతుంది. అయినా ఇది సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈనేపథ్యంలో మూవీ ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. హిరణ్య కసిప ఆగిపోలేదని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుకుంటుందని చెప్పుకొచ్చారు. దీనితో హిరణ్య కశిప ఆగిపోయిందంటూ వస్తున్న వదంతులకు చెక్ పెట్టినట్లైంది.