టాలీవుడ్ ఇప్పుడు దేశంలోనే భారీ చిత్రాలు నిర్మించే పరిశ్రమలలో ఒకటిగా ఉంది. అలాగే మన స్టార్స్ స్టామినా ఎల్లలు దాటిపోయింది. తెలుగుతో పాటు, ఇతర పరిశ్రమలలో కూడా మన హీరోల సినిమాలు చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతున్నాయి. బాహుబలి, మరియు సాహో చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతి సినిమా బాలీవుడ్ లో విడుదల అవుతుంది. కాగా టాలీవుడ్ హీరోలకు ఉన్న క్రేజ్ రీత్యా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కొత్త ఆలోచన చేస్తున్నారట. టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ వంటి హీరోల సినిమాలు హిందీలో డబ్ చేయనున్నారట.
ఇప్పటికే కొన్ని చిత్రాలు హిందీలో డబ్ కాగా మన హీరోల సినిమాల హక్కులు దక్కించుకొని డబ్ చేసే ఆలోచనలో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని సమాచారం. యూట్యూబ్ లో స్టార హీరోల హిందీ వర్షన్స్ వందల మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంటూ రికార్డ్స్ కొడుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన సరైనోడు హిందీ వర్షన్ 300 మిలియన్స్ వ్యూస్ దక్కించుకొని ఆల్ టైం రికార్డు కొట్టిన సంగతి తెలిసిందే. మన స్టార్ హీరోల గత చిత్రాలు అలాగే హిందీలో విడుదల కానీ రాబోయే సినిమాలు అక్కడ డబ్ చేయాలనేది వారి ఆలోచనగా తెలుస్తుంది.