ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న డ్రాగన్ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఐతే, లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతోందట. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. పైగా ఈ సినిమాకే కాకుండా, ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే ఈ సీక్వెన్స్ హైలెట్ గా నిలిచిపోతుందని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే, ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది.
మరోవైపు, ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.