కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ జెట్ స్పీడ్ లో తన సినిమాలు కంప్లీట్ చేస్తూ వెళుతున్నాడు. తమిళ్ సహా తెలుగులో కూడా చేస్తున్న తాను రీసెంట్ గా “హిట్ 3” క్లైమాక్స్ లో కనిపించి క్రేజీ ట్రీట్ ని ఆడియెన్స్ కి అందించాడు. మరి కార్తీ నుంచి అయితే మన ఇండియన్ సినిమా దగ్గర అత్యధిక సీక్వెల్స్ వచ్చేలా ఉన్నాయని చెప్పాలి.
తాను హీరోగా నటిస్తున్న సీక్వెల్స్ చిత్రాలే ఖైదీ 2, సర్దార్ 2 చిత్రాలు ఉండగా వీటితో పాటిగా ఖాకీ 2 కూడా రానుందట. అలాగే యుగానికి ఒక్కడు సీక్వెల్ లో కూడా తాను ఉండొచ్చు వీటితో పాటుగా కంగువా 2 లో కూడా కార్తీ కనిపించనున్నాడు. మరి వీటిలో కంగువా 2 సందేహమే కానీ మిగతా అన్నిటిలో కార్తీ ప్రెజెన్స్ ఉంటుంది. ఇలా హైయెస్ట్ సీక్వెల్ చిత్రాలు మాత్రం ఈ టాలెంటెడ్ హీరో నుంచి రానున్నాయని చెప్పొచ్చు.