ఇద్దరమ్మాయిలతో ఆడియోపై భారీ అంచనాలు

Iddarammayilatho-audio

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఆడియో లాంచ్ వేడుక రేపు జరగనుంది. ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యడంతో ఈ ఆల్బమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేవీ శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్ – దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చి ఉండడం, ‘ఇద్దరమ్మాయిలతో’ మొదట్లో వచ్చిన టీజర్లో ఇచ్చిన ఫస్ట్ ట్యూన్ చాలా కొత్తగా ఉండడంతో ఈ మూవీ ఆల్బం పై అంచనాలు భారీగా ఉన్నాయి.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. కేథరిన్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్, ఎస్ ఆర్ శేఖర్ ఎడిటర్ గా పనిచేసారు. రేపు ఆడియో విడుదలవుతున్న ఈ సినిమాని మే 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Exit mobile version