‘హరి హర వీరమల్లు’ పై నిధి అగర్వాల్ క్రేజీ అప్ డేట్స్ !

‘హరి హర వీరమల్లు’ పై నిధి అగర్వాల్ క్రేజీ అప్ డేట్స్ !

Published on May 25, 2025 12:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి స్వరపరచిన “తారా తారా” అనే లిరికల్ ట్రాక్ మే 28, 2025న విడుదల కానుందని నిధి అగర్వాల్ తాజాగా వెల్లడించింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎనర్జీని మరియు డ్యాన్స్ వైబ్‌ను ఈ పాట తీసుకువస్తుందని ఆమె తన పోస్ట్ లో తెలిపింది. ఇక ఈ సినిమా తాలూకు పూర్తి స్థాయి ప్రమోషనల్ కార్యకలాపాలు కూడా మే 27, 2025న ప్రారంభమవుతాయని ఆమె తెలిపింది.

అన్నట్టు డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే

సంబంధిత సమాచారం

తాజా వార్తలు