మహేష్ చేసిన పనిని నమ్మలేకున్న యంగ్ హీరోయిన్

కరోనా వైరస్ ప్రభావంతో ఎవరికీ పనిలేదు. మహేష్ సైతం సినిమా షూటింగ్స్ కి ఇంకా సమయం ఉండడంతో ఇంటికే పరిమితం అవుతున్నారు. దీనితో మహేష్ కుటుంబంతో గడపడంతో పాటు, ఇష్టమైన వ్యాపకాలలో మునిగిపోతున్నారు. నచ్చిన పుస్తకాలు చదువుతున్నారు. అలాగే కొత్త సినిమాలు చూస్తున్నారు. కాగా గత రాత్రి ఆయన ఓ మై కడవలే అనే తమిళ చిత్రం చూశారట. ఆ మూవీ అద్భుతంగా ఉందని ఆయన ట్వీట్ చేయడం జరిగింది.

ఈ చిత్ర హీరోయిన్ రితికా సింగ్ కి మహేష్ స్వయంగా తను నటించిన సినిమాను మెచ్చుకోవడం సూపర్ కిక్ ఇచ్చిందట. అవునా నేను నమ్మలేక పోతున్నాను, ధన్యవాదాలు సార్, అటూ సోషల్ మీడియా వేదికగా ఉబ్బితబ్బిబ్బు అయ్యింది. అశోక్ సెల్వన్, రితికా సింగ్ మరియు వాణి భోజన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రానికి అశ్వత మారిముత్తు దర్శకత్వం వహించారు.

Exit mobile version