‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన హెబ్బా పటేల్ ప్రస్తుతం ఛాన్స్ లు లేక గెస్ట్ రోల్స్ కు అండ్ ఐటమ్ సాంగ్స్ కు పరిమితమైంది. పైగా ఇంకో అడుగు ముందుకేసి కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ తరహాలోనే వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది, ఇప్పటికే మస్తిస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది హెబ్బా. ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్ లు చేయడానికి సన్నద్దమవుంతుంది.
ఆహాలో ప్రసారమయ్యే రెండు వెబ్ సిరీస్ ల్లో హెబ్బా నటించబోతుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ కోసం రూపుపొందుతున్న మరో వెబ్ సిరీస్ లోనూ హెబ్బా ఫుల్ బోల్డ్ క్యారెక్టర్ లో నటించనుంది. మరి ఈ వెబ్ ప్రయత్నంతోనైనా హెబ్బా పటేల్ మళ్ళీ క్రేజ్ ను అందుకుంటుందేమో చూడాలి. ‘రెడ్’ సినిమాలో కూడా ఈ హాట్ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా హెబ్బా ఈ సాంగ్ కోసం కనిపించబోతుందట. అలాగే ఐటమ్ సాంగ్ తో పాటు గెస్ట్ రోల్ లో కూడా రెడ్ సినిమాలో నటిస్తోందట.