హిట్ కి సీక్వెల్ చేస్తున్నాడట.

విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన మూవీ హిట్ ఈ ఏడాది విడుదలై పాజిటివ్ టాక్ సొంత చేసుకుంది. విశ్వక్ సేన్ సీరియస్ పోలీస్ అధికారి పాత్ర చేయగా క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దర్శకుడు శైలేష్ కొలను కి మొదటి ప్రయత్నంలో మంచి మార్కులే పడ్డాయి.

కాగా ఈ సినిమా సీక్వెల్ హిట్ 2 రానుందని తెలుస్తుంది. ఈ సీక్వెల్‌లోను విశ్వక్‌సేన్ హీరోగా నటించనున్నారు.

ఈ విషయాన్ని విశ్వక్‌సేన్‌ స్వయంగా తెలియజేశారు. తన భవిష్యత్ ప్రాజెక్ట్స్ లో హిట్‌-2 కూడా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. హిట్ చిత్రానికి నిర్మాతగా ఉన్న హీరో నాని సీక్వెల్ నిర్మించడం లేదని సమాచారం. ప్రస్తుతం విశ్వక్ పాగల్ అనే మూవీలో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ నరేష్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version