శ్రీ విష్ణు చేతుల మీదుగా ‘అమీర్‌ లోగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Amir-Log

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న చిత్రం ‘అమీర్‌ లోగ్’. ఈ చిత్రానికి రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తుండగా, మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్నారు.
యూత్ ఫుల్ కామెడీతో కూడిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా హైదరాబాద్ నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల కథగా సాగనుంది.

పోస్టర్‌ను చూసిన శ్రీ విష్ణు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి స్మరన్ సాయి సంగీతం అందిస్తుండగా, ఎస్‌వికె సినిమాటోగ్రఫీని, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

Exit mobile version