ప్రముఖ బ్యానర్ లో నిఖిల్ 20వ చిత్రం.

యంగ్ హీరో నిఖిల్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఆయన 20వ చిత్ర నిర్మాణం ఆసియన్ సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కనుంది. దీనిపై నిర్మాతలు నేడు అధికారిక ప్రకటన చేశారు. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్ ఎమ్ రావు ఈ చిత్రానికి నిర్మాతలుగా ఉండనున్నారు. రెయిన్బో రీల్స్ నిర్మించనున్నారు. నిఖిల్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ చిత్ర దర్శకుడు మరియు నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వివరించనున్నారు.

నిఖిల్ ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 చేస్తున్నారు. అలాగే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ పేరుతో ఓ మూవీ చేయనున్నారు. ఇక ఏషియన్ సినిమాస్ నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’ని నిర్మిస్తోంది, ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది.

Exit mobile version