‘మంచు మనోజ్’ కోసం ‘రామ్ చరణ్’ వస్తున్నాడు !


మంచు మనోజ్‌ ఇప్పటికే సినిమాలకు చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్.. ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఈ సినిమా రేపు లాంచ్ అవ్వబోతుంది.

రేపు ఉదయం 8 గంటలకు ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ మరియు చాలా మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Exit mobile version