తెలుగు సినీనటుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి ఈ రోజు ఉదయం 4:15 నిమిషాలకు చెన్నైలో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ యంగ్ హీరో చెన్నై లోని అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. అభి, హాసిని, సంచలనం లాంటి సినిమాలో కమలాకర్ నటించాడు. ప్రస్తుతం తను నటించిన బ్యాండ్ బాలు సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, 123తెలుగు.కామ్ తరపునా ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం.