బాలీవుడ్ హీరో గోవిందా కుమారుడు యశ్వర్ధన్ కారు ప్రమాదంలో చిక్కుకున్నాడు. గత రాత్రి ముంబైలోని జుహు వద్ద ప్రఖ్యాత నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్‌కు చెందిన కారు యశ్వర్ధన్ కారును ఢీకొట్టింది. యశ్వర్ధన్ కారు డ్రైవింగ్ చేస్తూ ఉండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఐతే ఈ ప్రమాదంలో అందరూ స్వల్ప గాయాలతో బయటపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యశ్వర్ధన్ చేతికి చిన్న గాయం అయినట్లు ఆయన తండ్రి గోవిందా చెప్పుకొచ్చారు
ఇక ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇరు వర్గాలు కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరించుకున్నట్టు తెలుస్తోంది. డ్రైవర్ క్షమాపణలు చెప్పడంతో తాము ఎటువంటి కేసు ఫైల్ చేయలేదని.. అవతలి కారు డ్రైవర్ కు కూడా ఎటువంటి గాయాలు అవ్వలేదని గోవిందా తెలిపారు. గోవిందా ఘటనా స్థలానికి వెళ్లారని.. అక్కడి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారంటూ కథనాలు వెలువడ్డాయి.