రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on May 3, 2020 2:59 AM IST

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ గొప్ప స్వాతంత్య్ర సమర యోధులు కలుసుకుని ఒకరికొకరు ఇన్స్పైర్ చేసుకుంటే ఎలా ఉంటుందనేదే పాయింట్. కాగా ఇద్దరు యోధుల యంగర్ వెర్షన్ మాత్రమే సినిమాలో ఉంటుందని, చేతిలో విల్లంబులతో మనకు తెలిసిన అల్లూరిని, తుపాకీ ధరించిన కొమురం భీమ్ ను చూపిస్తారని తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. అన్నట్టు ఎన్టీఆర్ మీద చిత్రీకరించిన ఫైట్ సీన్ తాలూకు విజువల్ ఒకటి ఆ మధ్య బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ అడవి పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన జరిగేది. ఈ పోరాట సన్నివేశంలో తారక్ లుక్ రివీల్ అయింది. మరి ఆ లుక్ లోనే సినిమా మొత్తం కనిపిస్తాడా లేక వేరే వేరియేషన్స్ కూడా ఉంటాయా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు