ఫస్ట్ లుక్ లో కేకపుట్టిస్తున్న స్టార్ హీరో

ఫస్ట్ లుక్ లో కేకపుట్టిస్తున్న స్టార్ హీరో

Published on Jul 23, 2020 1:59 PM IST

స్టార్ హీరో సూర్య బర్త్ డే నేడు. ఈ సంధర్భంగా ఆయన నెక్స్ట్ మూవీ ‘వాడి వాసల్’ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ లో బ్లాక్ కట్ బనియన్ ధరించి కండలు తిరిగిన శరీరంతో సీరియస్ పేస్ తో ఉన్న సూర్య గెటప్ ఆసక్తి రేపుతోంది. దర్శకుడు వెట్రిమారన్ మరోమారు విలేజ్ రివేంజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుండగా, సూర్య ఫాదర్ అండ్ సన్ రోల్స్ చేయనున్నారు. తండ్రిని చంపిన ఎద్దుపై ప్రతీకారం తీర్చుకొనే కొడుకుగా సూర్య పాత్ర ఉంటుందని సమాచారం.

గత ఏడాది దర్శకుడు వెట్రి మారన్ హీరో ధనుష్ తో అసురన్ అనే చిత్రాన్ని తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో సూర్య మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక సూర్య లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో చేస్తున్న ఆకాశం నీ హద్దురా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజా వార్తలు