నితిన్ బ్రతుకు బస్టాండ్ చేసిన కీర్తి సురేష్

నితిన్ బ్రతుకు బస్టాండ్ చేసిన కీర్తి సురేష్

Published on Jul 26, 2020 4:30 PM IST

ఈ ఏడాది భీష్మ చిత్రంతో ఓ మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న నితిన్, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రంగ్ దే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఈ మూవీ టీజర్ ని నితిన్ పెళ్లిని పురస్కరించుకొని చిత్ర యూనిట్ నేడు విడుదల చేశారు. ఒక నిమిషానికి పైగా ఉన్న టీజర్ ఆకట్టుకొనేలా సాగింది. ఇది పక్కారొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.

ఇక నితిన్ మరియు కీర్తి సురేష్ ల పెయిర్ చక్కగా ఉంది. కీర్తిని తప్పక, మనసొప్పక పెళ్లి చేసుకొనే యువకుడిగా నితిన్ పాత్ర ఉంది. మరి నితిన్ వద్దంటున్నా, కీర్తి వెంటబడి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అనేది ఆసక్తికర అంశం. సీనియర్ నటుడు నరేష్ నితిన్ నాన్న పాత్రలో కనిపిస్తున్నారు. ఏదిఏమైనా రంగ్ దే టీజర్ తో మూవీపై టీమ్ అంచనాలు పెంచేసింది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వీలైతే సంక్రాంతికి విడుదల చేస్తాం అంటున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు