చరణ్, ప్రభాస్ కూడా దేవరకొండ తరువాతే..!

ప్రముఖ మ్యాజగైన్ హైదరాబాద్ టైమ్స్ 2019 సంవత్సరానికి గాను మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ ప్రకటించింది. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ ప్రథమ స్థానంలో నిలిచారు. గత ఏడాది కూడా విజయ్ దేవరకొండ ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలవడం విశేషం. ఈ ఏడాది కూడా ఆయన తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. ఇక ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుండి రామ్ చరణ్ రెండవ స్థానం సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఆయన మూడో స్థానంలో ఉండగా ఒక స్థానం మెరుగుపరచుకొని 2వ స్థానానికి చేరారు.

మరో స్టార్ హీరో ప్రభాస్ రెండవ స్థానం నుండి 4వ స్థానానికి పడిపోవడం జరిగింది. గత ఏడాది ఆయన 2వ స్థానంలో ఉన్నారు. గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న రామ్ పోతినేని ఏకంగా 8 స్థానాలు మెరుగుపరుచుకొని 3వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఎన్టీఆర్ నుండి ఒక్క సినిమా కూడా విడుదల కానీ నేపథ్యంలో, ఎన్టీఆర్ 9వ స్థానం నుండి 19వ స్థానానికి పడిపోయారు. సుధీర్ బాబు, యాంకర్ ప్రదీప్ టాప్ 10 లో చోటు దక్కించుకోవడం విశేషం.

Exit mobile version