థియేటర్స్ బంద్ కారణంగా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ పండగ చేసుకుంటున్నాయి. ఈ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి ఓ టి టి దిగ్గజాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్స్ తో ప్రేక్షకులను ఆకర్శిస్తున్నారు. ఇక దిగ్గజ ఓ టి టి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా 17 హిందీ చిత్రాలను దక్కించుకుంది. అందులో జాన్వీ కపూర్ నటించిన బయోపిక్ గుంజన్ సక్సేనా, అలాగే సంజయ్ దత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తొర్భాజ్ మరియు భూమి పెడ్నేకర్ నటించిన డాలీ కిట్టి ఔర్ వో మరియు నవాజుద్దీన్ మరియు రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాత్ అఖేలి హై వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ఇండియన్ ఓ టి టి మార్కెట్ ని కొల్లగొట్టడానికి అమెజాన్ తో పోటీపడుతున్న నెక్స్ట్ ఫ్లిక్స్ అద్భుత ప్రాజెక్ట్స్ దక్కించుకొని ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటుంది. ఈ 17క్రేజీ ప్రాజెక్ట్స్ నెట్ ఫ్లిక్స్ చందాదారులను పెంచడం ఖాయంగా కనిపిస్తుంది.
నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వస్తున్న 17 చిత్రాలు.
1.గుంజన్ సక్సేనా
2.తొర్భాజ్
3.డాలీ కిట్టి ఔర్ వో
4.రాత్ ఆఖేలి హై
5.లూడో
6.క్లాస్ ఆఫ్ 83
7.గన్నీ వెడ్స్ సన్నీ
8.ఏ సూటబుల్ బాయ్
9.మిస్ మ్యాచ్డ్
10.ఏకే వర్సస్ ఏకే
11.సీరియస్ మెన్
12.త్రిభంగా
13.ఖాలీ ఖుహి
14.బాంబే రోజ్
15.భాగ్ బీనీ భాగ్
16.బాంబే బేగమ్స్
17.మసబా మసబా