ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూట్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో ఇంకా పవన్ పై కొన్ని కీలక షాట్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి ఏదన్నా అప్డేట్ వస్తే బాగుంటుంది అని పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ దసరాకు వకీల్ సాబ్ యూనిట్ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది.
అయితే అది టీజర్ కోసం లేదా మరే ఇతర అంశం కోసమా అన్నది ఇంకా క్లారిటీ లేదు కానీ దసరాకు మాత్రం మంచి ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లానింగ్ లో ఉన్నట్టు టాక్. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు భారీ ఓటిటి ఆఫర్స్ ను వదులుకున్నారు. మరి వకీల్ సాబ్ టీం నుంచి ఎలాంటి ట్రీట్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా అంజలి, నివేతా థామస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.