ఆర్జివీ సినిమాలను తలపిస్తున్న పరాన్నజీవి ఫస్ట్ లుక్

ఆర్జివీ సినిమాలను తలపిస్తున్న పరాన్నజీవి ఫస్ట్ లుక్

Published on Jul 22, 2020 3:14 PM IST

పవర్ స్టార్ వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా..రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ అనే టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఆ మూవీలో హీరోగా పవన్ ని పోలిన నటుడిని తెచ్చిన వర్మ, అంతా యాదృచ్ఛికమే… నా హీరో మీరు అనుకుంటున్న వారు కాదంటూ…రచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ పై ఇలాంటి సినిమాలు తీయడం వర్మకు ఇది కొత్తకాదు. గతంలో కూడా పవన్ పోలిన పాత్రతో ఆయన సినిమాలు తీయడం జరిగింది.

వర్మ చర్యలతో విసిగిపోయిన పవన్ ఫ్యాన్స్ ఆయనపై సినిమాకు సిద్ధం అయ్యారు. దర్శకుడు నూతన నాయుడు పరాన్నజీవి అనే టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. నుండి లిరికల్ సాంగ్ విడుదల చేసిన నూతన్ నాయుడు నేడు ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. వర్మ తాజా చిత్రాలను తలపించేలా ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉండడం విశేషం. ఇక ఈ చిత్రంలో ఆర్ జి వి రోల్ ప్రముఖ కమెడియన్ షకలక శంకర్ చేస్తున్నారు.

తాజా వార్తలు