“బిగ్ బాస్ సీజన్ 4” పై ఎక్స్ క్లూజివ్ సమాచారం మీకోసం.!

“బిగ్ బాస్ సీజన్ 4” పై ఎక్స్ క్లూజివ్ సమాచారం మీకోసం.!

Published on Jul 22, 2020 12:59 AM IST


మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై అతిపెద్ద రియాలిటీ షో అయినటువంటి “బిగ్ బాస్” ఇప్పటి వరకు మూడు సీజన్ లను పూర్తి చేసుకొని రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టింది. దీనితో సీజన్ 4 పై కూడా భారీ అంచనాలు నెలకొనగా ఈ షో అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూపులు చూసారు.

కానీ ఫైనల్ గా స్టార్ మా ఛానెల్ వారు ఈ సెన్సేషనల్ షో నాలుగో సీజన్ టీజర్ ను విడుదల చేసి కన్ఫర్మ్ చేసేసారు. దీనికి టాప్ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అందించారు. అయితే ఈ షోకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.

అయితే ఈసారి ఈ షోలో పాల్గొననున్న కంటెస్టెంట్స్ ఎంపికను స్టార్ మా ఆఫీస్ కు పిలవకుండానే జూమ్ లో ఇంట్రాక్షన్ ద్వారా ఎంపిక చేసారు. అలాగే ఈసారి మాత్రం కొన్ని సెన్సేషనల్ పేర్లనే ఎంపిక చేసారట. ఇక అలాగే ఈ సీజన్ కు కూడా లాస్ట్ సీజన్ కు హోస్ట్ చేసిన కింగ్ నాగార్జునే మళ్లీ హోస్ట్ చేయనున్నారు.

అందులో భాగంగా గత సీజన్ తో పోలిస్తే ఈసారి అంతకన్నా ఎక్కువగానే ఛార్జ్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన వ్యవహారాలు అన్ని స్టార్ మా యాజమాన్యం నాగార్జునతో జూమ్ కాలింగ్ ద్వారానే మాట్లాడుకోగా, ఈసారి నెలకొన్న పరిస్థితులకు తగ్గట్టుగానే టాస్కులు మరియు రూల్స్ డిజైన్ చేసారు. ఇక ఫైనల్ గా అతి తొందరలోనే బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు స్మాల్ స్క్రీన్స్ ను హిట్ చేయనుంది అని చెప్పడమే మిగిలి ఉంది.

తాజా వార్తలు