ఇప్పుడు మన టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల పర్వం ఊపందుకుంది. ఒకప్పుడు ఎప్పుడో అగ్ర హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎంతో అందంగా ఆనందంగా అనిపించేది. మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు తోటి స్టార్ హీరోలతో కలిసి నటించేందుకు ముందుకొస్తున్నారు. దీనితో వారి వారి అభిమానుల నడుమ మంచి ఫ్రెండ్లీ వాతావరణం నెలకొంది.
అయితే ఈ మధ్యనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సూపర్ స్టార్ మహేష్ లు కలిసి భారీ మల్టీ స్టారర్ లో నటించనున్నారని ఊహాగానాలు సినీ చక్కర్లు కొట్టాయి. పైగా ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ నిర్మించనున్నారని టాక్ వచ్చింది.
కానీ ఈ వార్తల్లో అసలు ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. అవన్నీ ఒట్టి ఊహాగానాలే అని ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి చర్చా జరగనట్టు వినికిడి. సో భవిష్యత్తులో ఈ ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో నటించినా ప్రస్తుతానికి మాత్రం ఫ్యాన్స్ ఎక్కువ అంచనాలు పెట్టుకోకపోవడం బెటర్.