సుకుమార్ మూవీలో బన్నీ లుక్ ఇదే ..!

సుకుమార్ మూవీలో బన్నీ లుక్ ఇదే ..!

Published on Mar 14, 2020 4:42 PM IST

అల్లు అర్జున్ 20వ సినిమా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కొరకు బన్నీ తో పాటు టీమ్ సభ్యులు కేరళ వెళ్లనున్నారు. షెడ్యూల్ గ్యాప్ లో బన్నీ తన పాత్రకు సంబంధించిన మేకోవర్ అయ్యేపనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్ లారి డ్రైవర్ రోల్ చేయనున్నాడని తెలుస్తున్న నేపథ్యంలో బన్నీ లుక్ పై ఓ క్లారిటీ వచ్చేసింది.

బన్నీ తన వ్యక్తిగత బాడీ గార్డ్ పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనగా ఆయన లుక్ బయటికి వచ్చింది. బన్నీ బాగా పెరిగిన జుట్టు మరియు గెడ్డంతో వైవిధ్యంగా కనిపించారు. సుకుమార్ రంగస్థలంలో రామ్ చరణ్ మాదిరి, జులపాలతో బన్నీని డీగ్లామర్ రోల్ లో చూపించనున్నాడని అర్థం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.

తాజా వార్తలు