మన దేశం గర్వించదగ్గ లెజెండరీ గాయకులు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు గత కొంత కొంత కాలం నుంచి కోవిడ్ తో పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటిలో ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉన్నప్పటికీ తర్వాత తర్వాత మాత్రం ఆయన ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు రావడంతో కాస్త ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
అలాగే వాటికి తోడు పలు తప్పుడు ప్రచారాలు కూడా మరింత ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఆయన తనయుడు ఎస్ పి చరణ్ ఒక క్లారిటీ తాజా అప్డేట్ తో వచ్చారు. ప్రస్తుతానికి బాలు గారి ఆరోగ్యం కుదురుగా ఉందని ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
అలాగే ఆయన చికిత్సకు మరియు వైద్యులకు రెస్పాండ్ కూడా అవుతున్నారని ఆయన తెలిపారు. అలాగే ఇప్పుడు నాన్న గారు 90 శాతం వరకు రికవర్ అయ్యారని తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులుగా తమ తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్ధించిన వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన వీడియో ద్వారా తెలిపారు.
https://twitter.com/baraju_SuperHit/status/1298473083079073792?s=20