ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రెబల్’ చిత్ర టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. మల్టీ ప్లెక్స్ బుకింగ్ మొదలైన కొద్ది సమయంలోనే ఈ చిత్ర టికెట్లు అమ్ముడు పోయాయి. దీన్ని బట్టి ‘రెబల్’ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది.
నెల్లూరు టౌన్ లో ఒక్క మూడు గంటల్లోనే సుమారు 10 లక్షల రూపాయల టికెట్స్ అమ్ముడు పోయాయి. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ మరియు తమన్నా గ్లామర్ ఈ చిత్రం పై అంచనాలను పెంచేసాయి. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె.భగవాన్ మరియు జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు.
ఇలాంటి టైంలో టికెట్స్ దొరకవని బాధపడకండి, 123తెలుగు.కామ్ జరుపుతున్న కాంటెస్ట్ లో పాల్గొని రెండు టికెట్స్ గెలుచుకోండి.
123తెలుగు రెబెల్ కాంటెస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి