గబ్బర్ సింగ్ టికెట్స్ కోసం భారీ క్రేజ్

గబ్బర్ సింగ్ టికెట్స్ కోసం భారీ క్రేజ్

Published on May 9, 2012 11:14 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ ఈ శుక్ర వారం విడుదలవుతుండగా టికెట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో మొదటి రోజు కోసం ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభించగా మొదటి గంటలోనే దాదాపు అన్ని ఏరియాల్లో టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో బుకింగ్ ప్రారంబించగా అభిమానులు భారీ సంఖ్యలో బారులు తీరడం మీరు పైన ఉన్న ఫోటోలో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే క్రేజ్ ఉండటం, వేసవి సెలవులు కూడా కలిసి వస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు