యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న ‘హార్ట్ అటాక్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ చిత్ర టీం ఇటీవలే స్పెయిన్ లో లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని తిరిగి వచ్చింది. యూరప్ లో తీసిన దాంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మిగిలి ఉన్న కొంత భాగాన్ని హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ ఈ రోజు నుంచి మొదలైంది.
నితిన్, ఆద శర్మ హీరో హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి పూరి జగన్నాథ్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ స్టైలిష్ అవతారంలో కనిపించనున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.