డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హార్ట్ ఎటాక్’ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరో నితిన్ మొదటిసారి పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేసిన ఈ సినిమాతో ఆద శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ ఈ సినిమాని నిర్మించాడు.
ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జనవరి 27న జరగనున్నాయి. స్పెయిన్ లో కలిసి ఇద్దరి మధ్య ఈ లవ్ ఎంటర్టైనర్ జరుగుతుంది. ఈ సినిమాలోని ఎక్కువభాగాన్ని స్పెయిన్, గోవా, హైదరాబాద్ లలో షూట్ చేసారు. ఈ సినిమాలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.