నవంబర్లో తిరిగి రానున్న హార్ట్ అటాక్ టీం

niithin
యంగ్ హీరో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హార్ట్ అటాక్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఇంటర్వల్ బ్లాక్ కి సంబందించిన ఓ ఫైట్ సీక్వెన్స్ ని మరియు ఓ సాంగ్ ని షూట్ చేసారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఆయనే తన సొంత బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

ఈ చిత్ర ప్రొడక్షన్ టీం నవంబర్ మొదటి వారం వరకు స్పెయిన్ లో షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన చాలా పార్ట్ ఈ షెడ్యూల్ లో పూర్తి కానుంది. ఆద శర్మ హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం కానున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ‘హార్ట్ అటాక్’ సినిమాలో నితిన్ ని చాలా స్టైలిష్ గా చూపించనున్నారు. బ్రహ్మానందం ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు.

Exit mobile version