‘ఇష్క్’ , ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల విజయంతో మంచి ఫామ్ లో వున్న నితిన్ కు ఇప్పుడు మరో ఆనందం జతకలిసింది. ఇటీవలే విడుదలైన తన కొత్త సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాన్’ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం నితిన్ తన తదుపరి సినిమా ‘హార్ట్ ఎటాక్’ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్ళాడు. సమాచారం ప్రకారం సినిమాలో ముఖ్యమైన భాగాన్ని ఇక్కడ స్పెయిన్ చుట్టు పక్కన లొకేషన్లలో చిత్రీకరిస్తారు.మొదటి షెడ్యూల్ లో క్లైమాక్స్ ను రెండో షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ లో ఇప్పటికే చిత్రీకరించారు ఈ సినిమా ద్వారా అదా శర్మ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం కానుంది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. పూరి జగన్నాధ్ ఈ సినిమాకు దర్శకత్వమే కాక నిర్మాణభాద్యతలు కూడా చేపట్టాడు