డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘హార్ట్ ఎటాక్’. ఈ రోజు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. యూత్ కి నచ్చే అంశాలు ఎక్కువగా ఉండడం వాళ్ళ ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆద శర్మ హీరోయిన్ గా పరిచయమవుతోంది.
పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ అయిన పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించాడు. స్పెయిన్, గోవా, హైదరాబాద్‌లలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.