రవిబాబు డైరెక్షన్లో వచ్చిన ‘నువ్విలా’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన హీరో హవీష్. ప్రస్తుతం హవీష్ హీరోగా ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘జీనియస్’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హీరో హవీష్ ని మొదటి సినిమాలో క్లాస్ గా కనిపించారు, మాస్ హీరోగా పేరుతెచ్చుకోవాలని ఈ సినిమా చేసారా? అని అడిగితే ‘ అలాంటిది ఏమీ లేదు. మాస్ హీరో కావాలని ఈ సినిమా చేయలేదు. కథ, పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా నటిస్తాను. అలాగే చేసిన మళ్ళీ మళ్ళీ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒక మంచి విషయాన్ని సమాజానికి తెలియజేయాలని ఈ సినిమా చేసాం’ అని హవీష్ అన్నాడు. చిన్నికృష్ణ కథ అందించిన ఈ సినిమాకి జోష్వా శ్రీధర్ మ్యూజిక్ అందించగా, దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు.