‘అఖండ-2’లో బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2 – తాండవం’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకడు బోయపాటి శ్రీను తనదైన మార్క్ టేకింగ్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర బోయపాటి-బాలయ్య కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

అయితే, ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఈ సినిమాలో పలువురు నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో తాజాగా బాలీవుడ్ చిత్రం ‘బజరంగీ భాయిజాన్’లో మున్నీ పాత్రలో నటించిన హర్షాలి మల్హోత్రా కూడా నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. జనని అనే పాత్రలో హర్షాలి కనిపించబోతున్నట్లు మేకర్స్ తాజాగా ఓ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

దీంతో ఈ సినిమాలో ఆమెది ఎలాంటి పాత్ర అయి ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version