నిర్మాతగా మారబోతున్న స్టార్ డైరెక్టర్ ?

టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నిర్మాతగా మారడానికి సిద్ధంగా ఉన్నారా, తాజా అప్ డేట్ ఏమిటంటే ప్రఖ్యాత నిర్మాత బన్నీ వాసుతో కలిసి దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనున్నారట. సినీ పరిశ్రమ కరోనా ప్రభావం నుండి తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత బన్నీ వాసు – హరీష్ శంకర్ నిర్మాణ కలయికలో ఓ ప్రాజెక్ట్ మొదలు కానుందట. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ కు హరీష్ శంకర్ ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.

Exit mobile version